లామివుడిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దస్త్రం:261px-Lamivudine Structural Formulea V.1.svg.png

Lamivudine, లామివుడైన్ ( 2',3'-dideoxy-3'-thiacytidine, 3TC, brand name Epivir®) అనేది HIV-1, Hepatitis B చికిత్సలో ఉపయోగించె nucleoside reverse transcriptase inhibitors (NRTIs) అనె తరగతికి చెందిన ఒకానొక ఔషదము.దీనికు 3TC పొడిపేరు. ఇది FDA (Food and Drug Administration of USA ) వారిచే HIV, Hepatitis B చికిత్స కోసం 17-Nov-1995[1] రోజున అమోదించబడింది.

మోతాదు ( Dosage )

[మార్చు]

Lamivudine టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం తీసుకోవాల్సి వుంటుంది. ఈ మందును పిల్లలు కూడా తీసుకొనవచ్చును. పరికడుపున కాని తిన్న తర్వాతగాని వెసుకొవచ్చు. ఈమందును ఒక్కదానినే వెసుకోకూడదు దీనితో పాటుగా ఇదే తరగతికి చెందిన కనీసం ఒక మందును అలాగే NNRTI కి చెందిన ఒక మందుతో కలిపి వేసుకుంటెనే వైరస్ రెజిస్టెన్స్ ను నివారించవచ్చు. ఒక వేళ మీరు మీ డొసేజ్ ను మరిచిపోతే గుర్తుకు వచ్చిన వెంబడే వేసుకొనండి కాని రెండవ డొసు వెసుకొనే సమయం దాదాపు దగ్గరకు మొదటిడొసును వదిలివేయండం మంచిది.

HIV తో ఉన్న పెద్దలకు డొస్ 150 mg రెండుసార్లు ప్రతిరోజు వేసుకొవాలి. Hepatitis B తో ఉన్న పెద్దలకు డొస్ 100 mg రోజుకు ఒకసారి. HIV, Hepatitis B రెండు ఉన్న వాళ్ళకు HIV డొస్ వర్తిస్తుంది. 3 నెలల నుండి 12 సంవత్సరాల పిల్లలకు 1.4–2 mg ప్రతి 0.45 kg లకు రెండు సార్లు, కాని రోజుకు 150 mg కంటే మించకూడదు.

దుష్ప్రబావాలు (Side Effects )

[మార్చు]
ఎయిడ్స్
ఉపశమన మందులు
స్టావుడిన్
లామివుడిన్
జిడోవుడిన్
డిడనొసిన్
అబాకవిర్
టెనొఫవిర్
ఎంట్రిసిటబిన్
నెవిరపిన్
ఎఫావిరెంజ్
ఇండినవిర్
అటాజనవిర్
రిటనోవిర్
లొపినవిర్
డారునవిర్
నెల్పినవిర్
సాక్వినవిర్

ఈ దుష్ప్రబావాలు [2] (Side Effects ) అనెవి మందుల వల్ల వచ్చేవి, ఇవి అందరికి ఒకేలా ఉండవు. కొందరికి కొన్ని రావచ్చు అసలు రాకపోవచ్చు. కొన్ని దుష్ప్రబావాలు ప్రాణాంతకమైనవి వీటిని సరైన సమయంలో గుర్తించి రాకుండా వెరెమార్గాలను అన్వేషించవచ్చు.

  1. Pancreatitis: ఇది రావటం చాల అరుదు కాని విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. క్లినికల్ ట్రయల్స్ లో 2,613 వ్యక్తులు దీనిని వాడితే 9 మందికి ఇది కనిపించింది, 0.3% మందికి ఇది కనిపించిందన్నమాట.[3] కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, వాంతివచ్చేటట్టు అనిపించటం దీని ప్రధానలక్షణాలు.
  2. Pheripheral Neauropathy (నరాల బలహీనత) : Lamivudine వల్ల వచ్చే దుష్ప్రభావాలలో ఇది కూడా ఒకటి. కాళ్ళు మొద్దుబారటం ( తిమ్మిర్లు) అలాగే జలదరించటం. అరికాళ్ళలో మంటలు. ముఖ్యంగా ఈ లక్షణాలు రెండుకాళ్ళలో కనిపిస్తుంది. ఈలక్షణాలను మొదట్లొనొ కనిపెట్టి ఈ మందును వాడటం అపివేసె ఇదే తరగతికి చెందిన (NRTIs) Zidovudine నుకాని TDF (Tenofovir) టెనొఫవిర్ ను కాని వాడితె Pheripheral Neauropathy నివారించవచ్చును. ఈలాగె వాడితె నొప్పులు శాశ్వతంగా ఉండిపోయె ప్రమాదం ఉంది. ఈ లక్షణాలు కనిపిస్తె ఈ మందును మార్చడం తప్ప వేరె ప్రత్యామ్నాయం లేదు. Lamivudine వల్ల వచ్చే Neauropathy, Stavudine కంటే చాలతక్కువగా వుంటుంది.
  3. Lactic acidosis: ఇది NRTIs తరగతి మందుల తిసుకునే వారిలో వస్తుంది. రక్తంలో Lactic Acid ఉండవలసిన దానికంటె ఎక్కువ అవుతుంది (సాధారణంగా 0.50-2.20 mmol/L మధ్యలో వుండాలి). చాల అరుదుగా వస్తుంది. ప్రాణాంతకమైనది. వాంతులు, కడుపులో నొప్పి, నిస్సత్తువ, అలసట, శ్వాస తీసుకొవటంలో ఇబ్బంది వంటివి వీటి ప్రదాన లక్షణాలు. ఈ లక్షణాలు కనక కనిపిస్తే వెంబడె రక్తంలో Lactat Levels ను చూసి మీడాక్టరు ఈ వ్యాధి తీవ్రతను నిర్ణయిస్తాడు.మహిళలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
  4. Lipodystrophy: కొన్ని NRTI తరగతికి చెందిన మందులవల్ల ఈ సమస్య వస్తుంది. కాళ్ళల్లొ, చెతుల్లో, మొహంలో కొవ్వు కుంచించికుపొతుంది. ఇది దీర్ఘకాలికంగా వాడినప్పుడు మాత్రమే వస్తుంది. కాళ్ళు, చేతులు సన్నబడిపోతున్నట్టు అనిపిస్తె వెంబడె మీ డాక్టరుగారిని సంప్రందించండి.అలాగే మీ శరీరంలో ఎక్కడైన కొవ్వు కుంచించుకు పోయినట్టు అనిపించిన మీ డాక్టరు గారిని సంప్రందించండి.
  5. సాధారణంగా వచ్చే దుష్ప్రబావాలు: వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, తలనొప్పి, ఆకలి మందగించటం. ఇవ్వన్ని కొన్ని రోజుల్లో మాయమవుతాయి.

ఈ మందును ఎవరు వేసుకోకుడదంటె?

[మార్చు]

ఈ మందును వెసుకునేముందు మీడాక్టరుకు చెప్పాల్సిన విషయాలు. మీకు ఎదైన లివర్, కిడ్ని సమస్యలు వుంటె, ఇంతకు ముందు క్లొమ లోపం వచ్చివుంటె, అనిమియా వచ్చివుంటె, ఎర్రరక్తకణాలు తక్కువగా ఉంటె, ఇంతకు ముందు మీకు ఎప్పుడైన ఉన్నదానికంటె Lactate Levels ఎక్కువగా ఉండి ఉంటె, ఇంతకు ముందు Pheripheral Neauropathy (నరాల బలహీనత) ఇంతకు ముందు ఉండివుంటె.వీటిలో ఎదైన సమస్య ఉన్న వాళ్లు ఈ మందును తీసుకొకపొవచ్చు లేదా ప్రత్యేక పర్యవేక్షణలో తీసుకొనవలసి ఉంటుంది

గర్భవతి మహిళలు వేసుకొవచ్చా?

[మార్చు]

ఇది FDA వారిచే ప్రెగ్నెన్సి తరగతి C గా వర్గీకరించబడ్డది. అంటే దీనిని జంతువుల పై ప్రయోగించినపుడు పరీక్షలలో తెలినది ఏమిటంటే గర్భంలోని పిండం పైన ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాని మనుషుల పైన సరియైన, కచ్చితమైన సమాచారం లేదు. గర్భిణి మహిళలు ఈ మందును వేసుకొవటంలో సమస్యలు వున్నప్పటికి ప్రయోజనాలు కొన్ని ఉన్నాయి. అలాగే బాలింత మహిళ పాలలో ఈ మందు ప్రాభావం పిల్లలపై ఎలా వుంటుంది అనే సమాచారం లేదు. అయితే HIV Positive గర్భవతి మహిళ తమ పిల్లలకు పాలు ఇవ్వకపొవడం మంచిది.

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-06-27. Retrieved 2012-07-08.
  2. http://www.aidsmeds.com/archive/Epivir_1579.shtml
  3. http://www.rxlist.com/epivir-drug/side-effects-interactions.htm