sex
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, జాతి.
- the population of both sexes అక్కడి ఆడవాండ్లు, మొగవాండ్లు.
- the petitioners were admitted sex by sex, to his courtమనవిచేసుకొన్న వాండ్లలో స్త్రీలు వేరే పురుషులు వేరేగా లోనికి వచ్చినారు.
- in the dress of these people the sex is not distinguished; bothsexes dress alike వీండ్లలో ఆడవాండ్లకు మొగవాండ్లకు వొకటే వుడుపు.
- in birds the sex is known by the colour వర్ణముచేత ఆడపక్షి మొగపక్షితెలుస్తున్నది.
- the sex of a palm tree is known by the leaf తాటిచేట్టు పోతో పెంటో దాని ఆకువల్ల తెలుస్తున్నది.
- the parts that mark the sex లింగము, మానస్థానము.
- the queen replied "Those of or sex must submit" మన బోటి స్త్రీలు లోబడవలసినదని రాణి అన్నది.
- the sex స్త్రీలు.
- the femalesex స్త్రీ జాతి, స్త్రీలు.
- in this school there are pupils of both sexes ఈ పల్లెకూటములో ఆడవాండ్లు మొగవాండ్లు కూడా చదువు కుంటూ వున్నారు.
- the rudersex or stronger sex మొగవాండ్లు.
- the weaker sex అబలలు, అనగా స్త్రీలు.
- the fair sex స్త్రీలు.
- she is disgrace to her sex దానివల్ల ఆడవాండ్లకంతా అవమానము వచ్చినది.
- she was endowed with courage beyond her sex or she out went her sex in resolution దానిధైర్యము యే ఆడదాన్నికిన్ని లేదు.
- she was flower or crown of her sex అది స్త్రీ రత్నము, కాంతా తిలకము.
- he slew them all without any regard to sex or age ఆడది ఆనక మొగవాడనక పిన్న అనక పెద్ద అనక అందరినిన్నీ చంపినాడు.
- in that country both sexes great equestrains ఆ దేశములో ఆడదైనా సరే మొగవాడైనా సరే బాగా గుర్రమెక్కి సవారిచేస్తారు.
- the Musulmans forbid all conversation between the sexes తురకవాండ్లు మొగవాండ్లతో ఆడవాండ్లను సంభాషించనియ్యరు.
- the softer sex స్త్రీలు.
- the braver sex పురుషులు.
- she hates the whole sex దానికి మొగవాడంటే గిట్టదు.
- of servants she had one of each sex వొక ఆడదాన్నిన్ని వొక మొగవాన్నిన్ని పనివాండ్లుగా పెట్టుకొని వుండినది.
- the gods of both sexes దేవతలున్ను దేవతా స్త్రీలున్ను.
- people of neither sex were allowed to see the queen రాణిని మొగవాండ్లున్ను చూడకూడదు, ఆడవాండ్లున్ను చూడకూడదు.
- Musulman women are never allowed to speak with the other sex తురకలు స్త్రీలను మొగవాండ్లతో, మాట్లాడనియ్యరు.
- they had no servants of either sex వాండ్ల వద్ద పనివాడూ లేదు పనికత్తె లేదు.
King Alfred, writing in Saxon calls the two sexes"the spear-half, '
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).