charge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, care custody వశము, అధీనము.
- expense, cost వ్రయము, శెలవు, వెల కూలి.
- he bore my charges నాకు పట్టిన శెలవు అతని పెట్టుకొన్నాడు.
- he got it free of charge వాడికి అది తేరకు వచ్చినది.
- accuation, imputation నింద, నెపము, అపరాధము.
- a false charge అపనింద, అపోహము, అభాండము, తప్పు ఫిర్యాదు he filed a charge against them వాండ్ల మీద ఫిర్యాదు వ్రాసి దాఖలు చేసినాడు.
- Onset or attack ఆ క్రమణము, యెదిరింపు, ధాటి.
- he brought his spear to the charge ఈటెతో పొడవవచ్చినాడు.
- Commission,trust conferred, భారము, బరువు.
- the prisoner was in my charge or, I was in charge of the prisoner ఆ ఖైది నా వశములో వుండినాడు.
- he was in charge of the house; or, the house was in his charge ఆ యిల్లు వాడిపరముగా వుండినది I was in charge of the school in his absence వాడు లేనప్పుడు నేను ఆ పల్లె కూటము చెప్పుతూ వుంటిని.
- his children are my charge వాడి బిడ్డలు నా పోషణలో వున్నారు.
- of powder and ball in a gun ఘట్టించి వుండే మందుగుండు, బారు చేసి వుండే మందుగుండు.
- he lodged the charge in my leg వాడు కాల్చిన గుండు నా కాలిలో పారినది.
- he drow the charge of his gun ఘట్టించివుండే మందుగుండును బైటికి తీసివేసినాడు.
- precept, command ఆజ్ఞ, a speech బిషపుగాని, న్యాయాధిపతి గాని చెప్పే బోధ.
- the judge delivered a charge to the jury న్యాయాధిపతి జూరీలకు బోధ చేసినాడు.
- he took charge of the house ఆ యింటిని వొప్పగించుకొన్నాడు, వశము చేసుకొన్నాడు.
- he gave me charge of the house ఆ యింటిని నాకు వొప్పగించినాడు.
క్రియ, విశేషణం, వేయుట.
- to put in an account పద్దు కట్టు, ఖర్చు వ్రాయుట.
- what do you charge for this cloth? యీ గుడ్డకు యేమి వెల చెప్పుతావు.
- he charged me very high for this దీనికి అధిక వెల కట్టినాడు, అధిక వెల అడిగినాడు.
- he charged noting for doing this దీన్ని చేయడమునకు వాడు కూలి అడగ లేదు.
- to accuse మోపుట, నేరము మోపుట, తప్పు మోపుట.
- they charged him with the crime యీ నేరము వాడి మీద మోపినారు.
- I charged him with the theft వాడు దొంగిలించినట్టు ఫిర్యాదు తీసుకొని వచ్చినాను.
- to charge with adultery రంకు కట్టుట.
- to attack పైబడుట, దూరుట, తాకుట.
- the tiger charged us ఆ పులి మా మీదికి పారినది.
- the battalion charged the enemy పటాలము శత్రుదళము మీద పడ్డది.
- to entrust వొప్పగించుట వశము చేసుట.
- he charged us with the prisoners ఆ కైదీలను సమావేశము చేసినాడు.
- he charged me with the education of his sons తన కొడుకులకు చదువు చెప్పమని నాకు వొప్పగించినాడు.
- to load a gun ఘట్టించుట, బారు చేసుట.
- to command ఆజ్ఞాపించుట.
- to instruct బోధీంచుట.
- he stands charged with theft వాడి మీద దొంగతనము మోపివున్నది.
- we were charged by the Cavalry తురుపు వచ్చి మామీద పడ్డది.
- I am charged with the care of a large family పెద్ద కుటుంబమును కాళ్లకట్టుకొన్నాను.
- the gun was charged with two balls ఆ తుకాపి జోడుగండ్లు బారుచేసివున్నది.
- clouds charged with lightning మెరుపుల మయముగా వుండే మేఘములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).