పోర్చుగీసు భాష
పోర్చుగీసు భాష ఐరోపాలోని ఐబీరియన్ ద్వీపకల్పంలో ప్రారంభమైన రొమాన్స్ భాష. ఇది పోర్చుగల్, అంగోలా, మొజాంబిక్, గిని బిసౌ, కేప్ వర్డీ, బ్రెజిల్ దేశాల్లో ఏకైక అధికారిక భాష.[1] వలసల కాలంలో ఈ భాష ప్రపంచమంతా వ్యాపించింది. పోర్చుగీసు మాట్లాడే వ్యక్తులను, దేశాలను ల్యూసోఫోను లంటారు.
పోర్చుగీసు భాషను ప్రపంచ వ్యాప్తంగా సుమారు 25 కోట్ల మందికిపైగా మాట్లాడుతున్నారు. వీరిలో పోర్చుగీసు మాతృభాషగా కలిగినవారు 21 నుంచి 22 కోట్లమంది కాగా మిగతా వారు ద్వితీయ భాషగా మాట్లాడేవారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే భాషల్లో ఇది ఆరోస్థానంలో ఉంది. ఐరోపాలో అత్యధిక మంది మాతృభాషగా కలిగిన జాబితాలో మూడో స్థానంలో ఉంది.[2] ఇది దక్షిణ అమెరికాలోనే కాక దక్షిణార్ధ గోళంలోనే అత్యధిక మంది మాట్లాడే భాష.[3][4][5] లాటిన్ అమెరికాలో స్పానిష్ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష పోర్చుగీసు. ఆఫ్రికాలో ఎక్కువగా ఉపయోగించే మొదటి పది భాషల్లో ఒకటి.[6] యూరోపియన్ యూనియన్, మెర్కోసూర్, ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్, ఆఫ్రికన్ యూనియన్, ల్యూసోఫోన్ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన కమ్యూనిటీ ఆఫ్ పోర్చుగీస్ లాంగ్వేజ్ కంట్రీస్ గుర్తించిన అధికారిక భాషల్లో ఒకటి. 1997లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన పది భాషల్లో ఇది కూడా ఒకటి.[7][8]
మూలాలు
[మార్చు]- ↑ "Estados-membros" [Member States]. Community of Portuguese Language Countries (in పోర్చుగీస్). 7 February 2017.
- ↑ "CIA World Factbook". Retrieved 12 June 2015.
- ↑ Admin, e2f. "What are the 5 official languages of South America?". e2f (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-10-06. Retrieved 2020-06-21.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Lesson Nine: How Many People Speak Portuguese, And Where Is It Spoken?". Babbel Magazine (in ఇంగ్లీష్). Retrieved 2020-06-21.
- ↑ "Potencial Económico da Língua Portuguesa" (PDF). University of Coimbra.
- ↑ "Top 11 Most Spoken Languages in Africa". 2017-10-18.
- ↑ "The World's 10 most influential languages", George Werber, 1997, Language Today, retrieved on scribd.com
- ↑ Bernard Comrie, Encarta Encyclopedia (1998); George Weber, "Top Languages: The World's 10 Most Influential Languages", Language Today (Vol. 2, December 1997). Archived from the original on 2011-09-27. Retrieved 2011-09-28.