ఓఢ్ర గజపతులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1.1 పరిచయం:

ఒడిశాని పరిపాలిస్తునా తూర్పు గంగా రాజవంశం తరువాత మరొక మహిమాన్వితమైన రాజవంశం పాలన స్థాపన జరిగింది సూర్యవంశీ గజపతి రాజులు అని అంటారు. ఒడిశాలో గంగా రాజవంశంలో రాజకీయ గందరగోళం నెలకొంది గాంగుల బలహీనత, అసమర్థత కారణంగా 14 వ శతాబ్దం A.D మధ్యలో శక్తివంతమైన చక్రవర్తి కపిలేంద్ర దేవా (1434–66 CE) 1434లో స్థాపించారు. కపిలేంద్ర దేవ పాలనలో, సామ్రాజ్యం సరిహద్దులు విపరీతంగా విస్తరించబడ్డాయి; ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోని పెద్ద ప్రాంతాల నుండి, మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లోని తూర్పు, మధ్య ప్రాంతాల నుండి. రాజు శ్రీశ్రీ ... (108 సార్లు) గజపతి గౌడేశ్వర నవ కోటి కర్ణాట కల్వర్గేశ్వర అని బిరుదు పొందాడు. ఈ బిరుదును ఇప్పటికీ రథయాత్ర సమయంలో పూరి వద్ద వారి వారసులు ఉపయోగిస్తున్నారు. ఈ రాజవంశం ముఖ్యమైన పాలకులు పురుషోత్తమ దేవ (1466-1497), ప్రతాపరుద్ర దేవ (1497-1540). చివరి పాలకుడు కఖరువా దేవ 1541లో భోయి రాజవంశాన్ని స్థాపించిన గోవింద విద్యాధరచే చంపబడ్డాడు. ఈ రాజవంశం పాలకులు పౌరాణిక సూర్య వంశంకు చెందిన శ్రీ రామచంద్రుడు సంతతికి చెందిన రాజవంశం అని పేర్కొన్నారు.వీరు తమ సైన్యంలో పెద్ద ఏనుగులను కలిగి ఉన్నందున, వారు గజపతిగా ప్రసిద్ధి చెందారు.

1.2 సూర్యవంశీ గజపతులు :

సూర్యవంశీ పాలకులు తమ మూలాన్ని సూర్య భగవానుడిలో గుర్తించారు. 'గజపతి' లేదా "Lord of Elephants" ఈ రాజవంశం పాలకులచే స్థిరంగా జన్మించాయి. పూర్వం కొందరు తూర్పు గంగ పాలకులు 'గజపతి' బిరుదును కూడా కలిగి ఉన్నారు బహుశా ఈ రాజవంశం పాలకులు పెద్ద సంఖ్యలో ఏనుగులను కలిగి ఉండడంవలన ఆ పేరు వచ్చి ఉండవచ్చు . 15వ శతాబ్దంలో, 16వ శతాబ్దాలలో, సూర్యవంశీ రాజుల పాలనలో ఒడిషా తన వైభవం అత్యున్నత స్థాయికి చేరుకుంది. సూర్యవంశీ గజపతి రాజులు వారి దూకుడు సామ్రాజ్యవాదానికి మాత్రమే కాకుండా ఒక శతాబ్దం మొత్తము వారి పాలనకు ప్రసిద్ధి చెందారు, ఒడియా సాహిత్యంలో పునరుజ్జీవనానికి కూడా వారు దోహద పడ్డారు

1.3 మూలాలు (Sources )

ఒడిశాకు చెందిన సూర్యవంశీ గజపతి చరిత్ర అందుబాటులో ఉన్న వివిధ ఆధారాలు రెండు సమూహాలుగా విభజించబడింది

(1) సాహిత్య మూలాలు ,, (2) శాసనాలు.

1.3.1 సాహిత్య మూలాలు:

పరశురామ విజయం, అభినవ వేణిసంహారం, సరస్వతీ విలాసం, జగన్నాథ వల్లభ, ప్రబోధ చంద్రోదయ మొదలైనటువంటి సంస్కృత సాహిత్య రచనలు,,

మద్, అల పంజీ, సరళ మహాభారతం, చైతన్య భాగవతం, జగన్నాథ,చెరిటెమ్రిట్ మొదలైనటు వంటి ఒడియా రచనలు., చైతన్య చరితామృత, చైతన్య మంగళ వంటి బెంగాలీ సాహిత్య రచనలు, మనుచరితం, కృష్ణరస విజయము మొదలైన తెలుగు రచనలు, తారీఖ్-ఇ-ఫెరిష్ట, తబాకత్-ఇ-అక్బరీ, అక్బర్నామ, బుర్హాన్-ఇ-మాసిర్ మొదలైన పర్షియన్ రచనలు సాహిత్య మూలాలను, సూర్యవంశీ గజపతులు చరిత్రను తెలుపుతాయి .

1.3.2 శాసన ఆధారాలు  :

అదే విధంగా వెలగలని రాగి ఫలకం శాసనం వంటి కొన్ని శాసనాలు, లింగరాజు ఆలయ శాసనం, పూరీ జగన్నాథ ఆలయ శాసనం,, ఆంధ్రరాష్ట్రం లోని సింహాచలం శాసనాలు , శ్రీ శైలం, శ్రీకూర్మం ఇంకా వెలిచెర్ల రాగి ఫలకాలు, కొండవీడు శాసనాలు మొదలైనవి దొరికాయి పై వన్నీ ఒడిషాలోని పాలనకు సంబంధించిన శాసన మూలాలను తెలియజేస్తునాయి.

1.4 రాజకీయ చరిత్ర :

ఓడ్ర గజపతులు పాలకులు

1434–66 కపిలేంద్ర దేవ
• 1466–97 పురుషోత్తమ దేవ
• 1497–1540 ప్రతాపరుద్ర దేవా
• 1540–1541 కలువ దేవా
• 1541 కఖరువా దేవా